‘పక్కా లోకల్..’ సాంగ్ తో ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో కీలక క్రికెట్ ప్లేయర్ గా ఆడుతున్నందుకో…. తెలుగువారంటే అభిమానమో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, తన భార్య క్యాండీస్, కూతురుతో కలిసి అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ ‘రాములో రాములా’ పాటలకు డాన్సులు చేయడం, పోకిరి లో మహేష్ బాబు డైలాగ్ కొట్టడం బాహుబలి గెట్ అప్ వేసి అలరించడం, ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తెగ రెచ్చిపోతున్నాడు. ఈ వీడియోలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు.
ఈ రోజు ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు సందర్భంగా మరో పాట ఎత్తుకున్నారు ఆ దంపతులు. ఇప్పుడు నేను పక్కా లోకల్ పాటకు డ్యాన్ చేశారు. ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ‘పక్కా లోకల్.. నేను పక్కా లోకల్’ అంటూ తారక్‌తో కలిసి కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేసిన ఈ డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు వార్నర్ ప్రస్తుతం ఈ వీడియో తారక్ అభిమానులను అలరిస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్.. గ్రేట్ డే’ అంటూ ఆయన ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్ ఈ గిఫ్టును అందించారు.













