దర్బార్ ట్రైలర్ విడుదల
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. రౌడీలపై రజనీకాంత్ కత్తిదూస్తూ కనిపించిన సన్నివేశాలతో ఆసక్తిగా ట్రైలర్ ప్రారంభమైంది. సార్ వాళ్లకు చెప్పండి పోలీసుల దగ్గరకి లెఫ్ట్‌లో రావచ్చు. రైట్లో రావచ్చు కానీ స్ట్రెయిట్‌గా రావద్దని అంటూ రజనీ తనదైన శైలి మేనరిజమ్స్‌తో చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఆదిత్య అరుణాచలం అనే ముంబయా సిటీ పోలీస్ కమీషనర్‌గా రజనీకాంత్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒరిజినల్‌గానే విలన్నమ్మా.. ఐయామ్ ఏ బ్యాడ్ కాప్ అనే చివరి డైలాగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. జనవరి 9న సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం. సామాజిక ఇతివృత్తానికి సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలనూ జోడీస్తూ దర్శకుడు మురుగుదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.













