Daku Maharaj: డాకు మహారాజ్ ట్రైలర్ టాక్
వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ(Balakrishna) ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఎప్పటికప్పుడు హైప్ పెంచుతూ ఉండగా తాజాగా చిత్ర యూనిట్ డాకు మహారాజ్ ట్రైలర్(Daku Maharaj Trailer) ను రిలీజ్ చేసింది. బాబీ(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
జనం రాజుగా పిలుచుకునే ఓ మంచివాడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. బందిపోట్ల పాలిట తనొక సింహస్వప్నం. సడెన్ గా ఓ రోజు నానాజీగా స్కూలుకి వెళ్లే పాప ముందు ప్రత్యక్షమవుతాడు. తర్వాత కొన్ని రోజులకు మరో వేషంలో సీతారామ్ గా దర్శనమిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బయటికి కనిపించని ఓ చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఓ రాక్షసుడి వల్ల ప్రజలు బానిసలై కష్టాలు పడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలో అసలు డాకు ఎవరు? అతనికి పాపకి ఉన్న సంబంధమేంటన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగి తెలుసుకోవాల్సిందే. బాలయ్య మూడు షేడ్స్ లో బావున్నాడు. కొన్ని సీజీ షాట్స్ మంచి క్వాలిటీతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ అందరి అంచనాలకు మించే ఉంది.













