ఈ వారం సినిమాలపై వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్
ఎలాంటి సినిమాకైనా రిలీజైన వీక్లో వచ్చే వీకెండ్ చాలా కీలకం. సండే కలెక్షన్స్ ఎంత వచ్చాయనేదాన్ని బట్టి ఓపెనింగ్స్ స్థాయిని నిర్దేశిస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్కు వెళ్లడం రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు గండంగా మారింది. నవంబర్ 19న ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ జరగనున్న తెలిసిందే.
నిన్న సెమీ ఫైనల్ దెబ్బకే చాలా థియేటర్లు బోసిపోయాయి. వర్కింగ్ డే అయినా 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే వరల్డ్ కప్ ఫీవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఫైనల్, అందులోనూ హాలిడో.. ఇక క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఎఫెక్ట్ రెండు రోజుల ముందు రిలీజ్ అయ్యే మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి, మై నేమ్ ఈజ్ శృతి, స్పార్క్ లైఫ్, ఏ చోట నువ్వున్నా, జనం, అన్వేషి మీద పడనున్నాయి.
పేరుకు ఏడు రిలీజులైనా సరే మొదటి రెండు సినిమాలకే క్రేజ్ ఉంది. మిగిలిన సినిమాలన్నీ టాక్ మీదే ఆధారపడి ఉన్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు అయినా సరే మార్నింగ్ షోలకు వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. తిరిగి సోమవారం సహజంగా ఉండే డ్రాప్ ఎలాగూ తప్పదు. చాలా ఏళ్ల తర్వాత ఇండియా ఫైనల్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ చాలా జోష్ లో ఉన్నారు. టాస్ తో మొదలుపెడితే రాత్రి పదకొండు వరకు టీవీ ముందు నుంచి లేవడం జరగదు. మరి ఈ ఏడు సినిమాల్లో ఈ వారం ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.













