‘బిగ్‌బాస్’ సీజన్ 4కు కరోనా ఎఫెక్ట్!
దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన `బిగ్‌బాస్` షోకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న `బిగ్‌బాస్` నాలుగో సీజన్‌కి రెడీ అయింది. లాక్‌డౌన్‌కి ముందే నాలుగో సీజన్‌కి సంబంధించిన సన్నాహాలు జరిగాయి. అయితే లాక్‌డౌన్‌తో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు `బిగ్‌బాస్` నిర్వాహకులు. లాక్డౌన్ లేకపోయినట్టయితే ఈపాటికి `బిగ్‌బాస్` నాలుగో సీజన్ రన్నింగ్‌లో ఉండేది. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా అంతకుముందు రెండు సీజన్లను నాని, ఎన్టీఆర్ నడిపించారు. నాలుగో సీజన్‌కి సంబంధించిన వివరాలు, అందులో పార్టిసిపేట్ చేసే వారి పేర్లను కూడా ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు లాక్డౌన్ 4.0 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో `బిగ్‌బాస్` నాలుగో సీజన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ సీజన్లో హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ నుంచి `బిగ్‌బాస్` నాలుగో సీజన్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. నాలుగో సీజన్‌కు కూడా నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరో పక్క నాలుగో సీజన్ అసలు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎంపిక చేసిన పోటీదారుల వల్లే ఆ కన్ఫ్యూజన్ వచ్చింది. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరుని గమనిస్తే రాబోయే రోజులు ప్రజలకు మరింత కఠినతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో `బిగ్‌బాస్` సీజన్ 4లో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలు సుముఖంగా లేరని తెలుస్తోంది. మరి వీటన్నింటినీ అధిగమించి `బిగ్‌బాస్` సీజన్ 4 ప్రారంభమవుతుందా? లేదా?అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.













