Coolie: రజినీకాంత్ సినిమా టైటిల్ లో మార్పు

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తున్న సినిమా కూలీ(Coolie). ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఆగస్ట్ 14న కూలీ పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి హిందీలో టైటిల్ విషయంలో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఆల్రెడీ బాలీవుడ్ లో కూలీ(Coolie) అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉంది.
దీంతో రజినీకాంత్ కూలీని మజ్దూర్(Majdoor) అనే టైటిల్ తో రిలీజ్ చేస్తారని నెట్టింట వార్తలు వినిపించగా, ఇప్పుడు ఈ సినిమాకు హిందీలో కూలీ- ది పవర్ హౌస్(Coolie The Power House) అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఆ టైటిల్ తోనే బాలీవుడ్ లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ రీసెంట్ గా వెల్లడించారు.
కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) ఓ కీలక పాత్ర చేస్తుండగా, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్ గా నటిస్తున్నారు. శృతి హాసన్(Shruthi Hassan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) స్పెషల్ సాంగ్ చేస్తుండగా, సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సంగతి తెలిసిందే.