బుల్లితెర వైపు మక్కువ చూపుతున్న బ్రహ్మానందం
హాస్యబ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన కమెడియన్ బ్రహ్మానందం. మూడు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి హాస్య సినిమాలకు ఒక స్పెషజ్ క్రేజ్ ని ఆపాదించినవాడు బ్రహ్మానందం. ఇకపోతే ఇటీవల కాలంలో ఆయన సినిమాలలో కనిపించడం లేదు. ఆఫర్స్ రావడం లేదో మరి ఆయనే వద్దనుకుంటున్నారో. మాటలతోనే కాదు హావ భావాలతో నవ్వులు పండించిన బ్రహ్మానందానికి టాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కలేదంటే ఆశ్చర్యమే. బహుశా ఇలాంటి బ్యాడ్ డేస్ వస్తాయని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. దీంతో ఆయన గౌరవంగా సినిమాల నుంచి తనకు తానుగా తప్పుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా కూడా నేటితరం జనరేషన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ లలో సగానికి పైగా బ్రహ్మానందం స్టైల్ లోనే ఉంటాయి. ఆయన లేకుంటే మీమ్స్ ఈ రేంజ్ లో వచ్చేవా అని ఒక టాక్ కూడా వైరల్ అయ్యింది.
ఇకపోతే గత రెండేళ్లకు ముందు వరకు కూడా బ్రహ్మానందం చాలా బిజీగా ఉండేవారు. ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా కనిపించేవారు. వెయ్యి సినిమాలకు పైగా చేసిన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న కమెడియన్స్ డిఫరెంట్ గా ఉండడంతో పాటు కమర్షియల్ కామెడీయన్స్ కి అవకాశాలు తగ్గాయి. అందుకే బ్రహ్మానందంకి సరైన అవకాశాలు రావడం లేదు. అవకాశాలు తగ్గుతున్నాయనే విషయం బ్రహ్మానందంకి బాగా అర్ధమయ్యింది. అందుకే చిన్న చిన్న సినిమాల్ని చేయడం కూడా మానేశారు.అందుకు కారణం ఆయన ఒక కొత్త నిర్ణయం తీసికున్నారట. ఆఫర్స్ వస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారట.
ఇక నెక్స్ట్ సీరియల్స్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి. రెగ్యులర్ గా ఉండే సీరియల్స్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశం వస్తే నటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఘంటల ప్రకారం కాల్షీట్ ఇస్తూ రోజుకు 2 లక్షల రూపాయల వరకు పెమెంట్ తీసుకున్న బ్రహ్మానందం ఆ తరువాత రెమ్యునరేషన్ డోస్ తగ్గించినప్పటికి సరైన అవకాశాలు రాలేదు. అప్పట్లో దర్శకులు బ్రహ్మానందం లేకపోతే సినిమాలు తీసేవారు కాదు. అనంతరం వారు కూడా కొత్త కమెడియన్స్ పై ఇంట్రెస్ట్ చూపడంతో బ్రహ్మానందంకి సరైన క్రేజ్ రాలేదు. ఇక నెక్స్ట్ సిరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని ఒక డైలీ సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.













