Harihara Veeramallu: ఆ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్న వీరమల్లు
చూస్తుండగానే మార్చిలోకి అడుగుపెట్టేశాం. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) విడుదలకు మరో 27 రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమాను ఎలాగైనా చెప్పిన రోజునే రిలీజ్ చేస్తామని అప్పుడెప్పుడో చెప్పిన మేకర్స్, ఆ తర్వాత నుంచి ఎలాంటి సౌండ్ చేయట్లేదు. అయితే ఈ సినిమాకు ఇంకా కొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉందంటున్నారు.
నాలుగైదు రోజులు పవన్ డేట్స్ అడ్జస్ట్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందట. కానీ పవన్ హెల్త్, పొలిటికల్ పరంగా బిజీగా ఉండటం వల్ల అది కుదిరేట్టు లేదు కాబట్టి సినిమా పోస్ట్ పోన్ తప్పేలా లేదు. పవన్ రాడనే నమ్మకంతోనే మార్చి 28న నితిన్ రాబిన్‌హుడ్(Robinhood), 29న నాగవంశీ(Naga Vamsi) మ్యాడ్ స్క్వేర్(Mad2) సినిమాలు రిలీజ్‌ను ఫిక్స్ చేసుకుని ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశాయి.
అయితే వీరమల్లు మార్చి 28 నుంచి పోస్ట్ పోన్ అయితే ఏప్రిల్ 11, 18లో ఏదొక రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఏప్రిల్ 11 అంటే రెండు వారాలే ఎక్స్ట్రా టైమ్ దొరుకుతుంది. ఈ గ్యాప్ లో సినిమాను పూర్తి చేయగలరా లేదా అనేది కూడా అనుమానమే. అది కాకుండా 18 అనుకుంటే అనుష్క(Anushka) ఘాటీ(Ghaati) ఆ డేట్ ను ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. ఒకవేళ ఘాటీ కూడా వాయిదా పడితే వీరమల్లుకు ఆ డేట్ బాగా సెట్ అవుతుంది. కానీ ఘాటీని చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఏదేమైనా రిలీజ్ విషయంలో వీరమల్లు మేకర్స్ ఇప్పటికైనా ఓ క్లారిటీ ఇస్తే బావుంటుంది.













