ఆ తప్పుకు రెండు నెలల బాధపడిన విక్రమ్
మనమొకటి అనుకుంటే దేవుడు మరోటి అనుకుంటాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ నానుడికి ఎవరూ మినహాయింపు కాదు. ఇలాంటి అరుదైన అనుభవం తమిళ స్టార్ హీరో విక్రమ్ జీవితంలో కూడా జరిగిందట. 1994లో డైరెక్టర్ బొంబాయి సినిమా తీయాలనుకున్నప్పుడు దానికోసం ఆడిషన్స్ నిర్వహించాడు. రోజలా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, బాబ్రీ మసీదు కూల్చివేత బ్యాక్ డ్రాప్ అని తెలియడంతో ఈ సినిమాపై హైప్ బాగానే వచ్చింది.
అలాంటి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ కాదనుకోలేరు. అయితే విక్రమ్ కు ఆ టైమ్ లో హీరోగా పెద్ద బ్రేక్ రాలేదు. దీంతో బొంబాయి ఆడిషన్స్ కు వెళ్లాడు. అక్కడ మణిరత్నం స్టిల్ కెమెరా తీసుకొచ్చి ఒక సీన్ వివరించి దాన్ని నటించి చూపించమన్నారట. స్టిల్ ఫోటోగ్రఫీతో ఎక్స్ప్రెషన్స్ ఎలా చూస్తారనే డౌట్ తో విక్రమ్ అలానే నిల్చునిపోయాడు.
ఒకవేళ కదిలితే బ్లర్ అవుతుందమోననే భయంతో విక్రమ్ బిగదీసుకుని పోయాడట. దీంత ఆ ఆఫర్ ను అరవింద్ స్వామి కొట్టేశాడు. అలా ఆ సినిమా ఆఫర్ చేజారిందని లేదంటే తనకు కెరీర్లో అతిపెద్ద బ్రేక్ అప్పుడే వచ్చి ఉండేదని, ఓ క్లాసిక్ సినిమాకు హీరోగా ఉన్నాననే సంతృప్తి మిగిలుండేదని విక్రమ్ తెలిపాడు. అంతేకాదు బొంబాయి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు తర్వాత రెండు నెలల పాటూ రోజూ ఉదయం లేవగానే ఆ సన్నివేశం గుర్తొచ్చి ఏడ్చేవాడినని రీసెంట్ గా తంగలాన్ సక్సెస్ మీట్ లో విక్రమ్ వెల్లడించాడు.













