వశిష్ట ప్లానింగ్‌కు ఫిదా అయిన మెగాస్టార్
భారీ బడ్జెట్ తో అంటే వందల కోట్లతో ఫాంటసీ సినిమా అంటే ఎన్నో బాధ్యతలు డైరెక్టర్ మీద ఉంటాయి. దానికి తోడు పాన్ ఇండియా సినిమా అంటే అది మరీ ఎక్కువగా ఉంటుంది. ఆర్టిస్టుల కాల్షీట్స్, బడ్జెట్ లో వచ్చే బ్రేక్స్, వీఎఫ్ఎక్స్ కంపెనీలు చేసే లేట్ ఇలా ఎన్నో అడ్డులొస్తుంటాయి. కానీ యంగ్ డైరెక్టర్ వశిష్ట మాత్రం విశ్వంభరను తన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేసే దిశగా అడుగులేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తంతో సహా మూడు పాటలను ఇప్పటికే ఫినిష్ చేసిన వశిష్ట, త్వరలోనే ఇంట్రో సాంగ్, క్లైమాక్స్ ను షూట్ చేయనున్నాడట. వశిష్ట ప్లానింగ్ చూసి చిరూ ఫిదా అవుతున్నాడని యూనిట్ సభ్యులంటున్నారు. మామూలుగా తమ బ్యానర్ లో వచ్చే ఏ సినిమా అయినా సరే అనుకున్న విధంగా షూటింగ్ జరగదని యువి క్రియేషన్స్ కు పేరుంది. చాలా సార్లు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా.
ఇప్పుడు విశ్వంభర విషయంలో కూడా అదే జరుగుతుందనుకున్నారంతా. కానీ వశిష్ట చేసుకున్న ప్లానింగ్ వల్ల విశ్వంభర ఎలాంటి ఆటంకాలు లేకుండా చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. తన ప్లానింగ్ వల్లే బడ్జెట్ కూడా తగ్గుతుందని తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కీలకంగా ఉండనున్న విశ్వంభరకు ఈ పోస్ట్ ప్రొడక్షన్ రూపంలో అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరి 10ని మిస్ కాకూడదని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 22న చిరూ బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ కానుందని ఇన్సైడ్ టాక్.













