మెగా156గా విశ్వంభర కన్ఫర్మ్
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠతో చేయనున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మొదలైంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
ఫాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. చాలా కాలం తర్వాత చిరూ జగదేకవీరుడు అతిలోకసుందరి తరహా కథను చేస్తుండటంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాతో చిరూ మంచి సక్సెస్ అందుకుంటారని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకు విశంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలొచ్చాయి. కానీ ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మొదలవడంతో టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మెగా156 షూటింగ్ మొదలైన నేపథ్యంలో ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని లీకయ్యాయి. అందులో క్లాప్ బోర్డ్ పై విశ్వంభర అనే టైటిల్ ఉండటంతో క్లారిటీ వచ్చేసింది. రూ.200 కోట్లకు పైగా భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.













