చిరూ-అనిల్ కాంబోలో సినిమా దాదాపు ఖాయమే!
రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అసలు ఫ్లాపే లేని డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో మెప్పించే అనిల్ రావిపూడి కేవలం కామెడీని మాత్రమే కాకుండా క్లాస్ మరియు మాస్ రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయగలడనే విషయం మహేష్ బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరుతో ప్రూవ్ అయింది.
రీసెంట్గా భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని టాక్. ఎప్పటినుంచో చిరూతో సినిమా చేయాలని చూస్తున్న దిల్ రాజుకు అనిల్ రూపంలో ఆ కోరిక తీరేలా కనిపిస్తుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని, ప్రస్తుతం కథకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ కు కూడా స్టోరీ లైన్ నచ్చడంతో, ఫైనల్ వెర్షన్ రెడీ చేయమన్నాడట. ఒకసారి అనిల్, చిరూకి ఫుల్ నెరేషన్ ఇస్తే సినిమా ఎప్పుడు మొదలుపెట్టాలనేది డిసైడ్ కానుంది. మొత్తం అన్నీ కుదిరాకే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర చేస్తున్న చిరూ, ఆ సినిమా తర్వాత అనిల్‌తో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













