మెగాస్టార్ చిరంజీవి #153 వేదాళం రీమేక్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వారికీ దీటుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. దాదాపు 60శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక మెగా హీరో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ లోపే మరో రెండు ప్రాజెక్టుల్ని ఖాయంగా సెట్స్ పై ఉంచాలన్న ప్రణాళికతో దూసుకెళుతున్నారు చిరు.
వీటిలో లూసీఫర్ రీమేక్ దర్శకుడు వినాయక్ తో ..వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తో ఖాయం చేశారు.ఈ రెండు ప్రాజెక్ట్స్ లో తొలుత వేదాళం రీమేక్ సెట్స్ పైకి వెళుతుందని ప్రచారమవుతోంది. అంతేకాదు… మెహర్ రమేష్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు కు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. అదేంటంటే.. వేదాళం భారీ యాక్షన్ మూవీ కాబట్టి స్టంట్ కొరియోగ్రాఫర్ ని ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ద్వయం అన్బరివ్ (అన్బు అరివు) వేదాళం రీమేక్ కోసం బరిలోకి రానున్నారు.
కేజీఎఫ్ కు జాతీయ అవార్డును గెలుచుకున్న వీరిద్దరూ మెహర్ రమేష్ తో పాటు చిరంజీవిని కలుసుకున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తోంది. ఇక చిరు నటిస్తున్న ఆచార్య షూటింగ్ పూర్తి కాగానే.. మెహర్ రమేష్ ప్రాజెక్ట్ ని సెట్స్ పై తీసుకెళ్తాడాట మెగాస్టార్.













