హనుమాన్‌లో చిరంజీవి.. తేలే టైమొచ్చింది!
సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ దగ్గరే కాదు, ప్రమోషన్స్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6న జరుగుతుండగా, హనుమాన్ ఈవెంట్ కు 7న అన్ని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా రానున్నాడు.
హనుమాన్ ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు చిరంజీవి కళ్ళని పోలి ఉన్నాయని కామెంట్స్ రావడం, కట్ చేస్తే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్వయంగా చిరూనే గెస్టుగా రావడం చూస్తుంటే ఈ సినిమాతో చిరూకి లింక్ ఉందనే అనుకుంటున్నారు. కానీ టీమ్ సభ్యులు మాత్రం అదేమీ లేదని అప్పట్లో చెప్పారు. కానీ ఒకవేళ ఏదైనా సర్ప్రైజ్ ఉంటే మాత్రం అది ఈ ప్రీ రిలీజ్ లో తెలిసే ఛాన్సుంది.
చిరూకు ఇష్ట దైవమైన హనుమంతుడు. పలు సందర్భాల్లో ఆయన తన ఇష్టదైవం గురించి చెప్పిన సందర్భాలున్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి లో కాసేపు హనుమంతుడి గెటప్ లో ఫైటింగ్ కూడా చేసి అలరించాడు. వీటన్నింటితో పాటూ తేజ సజ్జకు, చిరూ కు కూడా స్పెషల్ బాండింగ్ ఉంది. తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చిరూ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న హనుమాన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ హైప్ ను మరింత పెంచుకోవడం ఖాయం.













