చిరూ మద్దతు వెనుక అసలు కారణమిదే
రీసెంట్ గా తీవ్ర వివాదానికి దారి తీసిన మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ల వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలిసిందే. త్రిష గురించి లిమిట్స్ దాటి మాట్లాడిన మన్సూర్, ఆ తర్వాత విమర్శలు రావడంతో సారీ చెప్పాడు. వెంటనే మళ్లీ కేసులు పెడతానని రచ్చ చేశాడు. అయితే ఈ కాంట్రవర్సీ జరుగుతున్న టైమ్ లో చిరంజీవి ట్విట్టర్ వేదికగా త్రిషకు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో మన్సూర్ చిరంజీవిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆ డబ్బును పేదలకు సాయం చేస్తానని మళ్లీ రచ్చ చేశాడు. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం మన్సూర్ ఆడుతున్న డ్రామా అని చెన్నై మీడియా చెప్తోంది. ఇదిలా ఉంటే చిరూ, త్రిషకు అంతలా సపోర్ట్ చేయడానికి ఆమె విశ్వంభర సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపికవ్వడమని తెలుస్తోంది.
వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న విశ్వంభర రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఈ ఫాంటసీ డ్రామాలో విలన్ గా రానా కన్ఫర్మ్ కాగా, అనుష్క ఒక హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. మరో హీరోయిన్ గా త్రిష ను కూడా డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడని టాక్. వీటన్నింటినీ మంచి టైమ్ చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనుందట విశ్వంభర టీమ్. అందుకే మన్సూర్ వివాదంలో తన కో స్టార్ త్రిషకు నైతిక మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చిరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడని అందరూ అంటున్నారు.













