దర్బార్ సూపర్ హిట్ కావాలి ..మెగాస్టార్
సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి.. ఆ వేదికపై చేసిన ప్రసంగంలో తన మిత్రుడు రజనీకాంత్ నటించిన దర్బార్ కూడా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిచారు. రజనీకాంత్ చిరంజీవి మంచి మిత్రుల్లన విషయం తెలిసిందే. తమిద్దరి మధ్య గల స్నేహాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఈ నెల 9న విడుదలవుతున్న దర్బార్ చిత్రం ఘన విజయం కావాలని కోరుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన దర్బార్‌లో నయనతార హీరోయిన్గా నటించింది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత రజనీకాంత్ పవర్‌పుల్ పోలీసాఫీసర్‌గా నటించడం, మురుగదాస్ తొలిసారి రజనీని డైరెక్ట్ చేయడం వంటి కారణాలు దర్బార్ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి.













