పోరాటంతోనే మెగాస్టార్ 153వ.. చిత్రం ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం పట్టాలెక్కింది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్ లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు మోహన్ రాజా. నా తల్లిదండ్రులు స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో మరో ప్రయాణం మొదలైంది. మెగా మూవీ కోసం ఓ అద్భుతమైన బృందంతో కలిసి పని చేస్తున్నాం అని ఆ ఫొటోకి ఓ వ్యా్యని జత చేశారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ మొదలు పెట్టినట్లు తెలిసింది. దీనికి స్టంట్ మాస్టర్ సిల్వ నేతృత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన లూసీఫర్‌కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గూడ్ ఫిలింస్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీనికి తమన్ స్వరాలందిస్తుండగా, నిరవ్ సా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.













