మరోసారి జోడీగా చిరు, నయనతార!
నయనతార లేడీ సూపర్‌స్టార్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆమె ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డి లో కథానాయికగా నటిస్తుంది. చిరంజీవితో కలిసి తొలిసారి నటిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరోసారి చిరు, నయనతార జోడీ కట్టబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నయనతారనే కథానాయికగా ఎంపిక చేయాలని అటు చిరు, ఇటు కొరటాల శివ ఇద్దరూ భావిస్తున్నారట. అయితే ఇందులో కథానాయికగా మొదట తమన్నా, అనుష్క, శృతిహాసన్, కీర్తిసురేష్వంటి వారితో పాటు నయనతార పేరు కూడా వినిపించింది. వీరిలో ఎవరు కథానాయికగా నటిస్తారనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొన్న నేపథ్యంలో ఫైనల్‌గా నయనతారనే ఓకే చేశారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం ప్రారంభం కానుంది. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని జరుపుకోనుందని తెలుస్తోంది.













