మెగాస్టార్ పుట్టనరోజు సందర్భంగా… ఉప్పొంగిన అభిమానం!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాలకు చెందిన అభిమానులను ఉప్పుతో ఆయన చిత్రాన్ని వేసి ప్రేమను చాటుకున్నారు. గద్వాలలోని ధూరూర్మెట్టు రహదారిలో 30 క్వింటాళ్ల ఉప్పు, రంగులు అద్దిన అవగాలతో 400 అడుగుల పొడవు, 250 అడుగలు వెడల్పులు విస్తీర్ణంలో మెగాస్టార్ చిత్రాన్ని రూపొందించారు. దీనికి 3 రోజుల పాటు 10 మంది కష్టపడినట్లు తెలిపారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జమ్మన్న, సభ్యులు సిద్దు, అయ్యప్ప, రఘు, రంగస్వామి, రాము తదితరులు ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు.













