చిరూ నుంచి పాన్ ఇండియా మూవీ ?
మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 150 కి పైగా సినిమాలు చేసిన ఆయన ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలడు. అలాంటి మెగాస్టార్ తెలుగులో కాకుండా బాలీవుడ్ చేసిన సినిమాలు చాలా తక్కువ. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసినా, ఆ తర్వాత మెగాస్టార్ కేవలం టాలీవుడ్ కే పరిమితమయ్యాడు.
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేస్తుంటే చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోనట్లు అనిపిస్తోంది. మొన్నా మధ్య సైరా నరసింహారెడ్డిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసినా అది అనుకున్న ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాలు చేయలేదు చిరూ.
అయితే చిరూ బాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడానికి రీజన్, సరైన కథ దొరక్కపోవడమే అని గతంలో చెప్పాడు. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. తెలుగు సినిమా ప్రపంచంలో సత్తా చాటుతున్న ఐటమ్ టైమ్ లో ప్రతీ సినిమా పెద్ద మొత్తం బడ్జెట్ తో రూపొందుతుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేశారు. మరి చిరూ కూడా తను చేస్తున్న విశ్వంభర సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.













