చింతకింది మల్లేశం ఫస్ట్ లుక్ విడుదల
ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలు పోషించిన చిత్రం మల్లేశం. రాజ్ దర్శకుడు. శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మాతలు. హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పద్మశ్రీ చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. అగిపెట్టెలో పట్టేంత పట్టుచీరలను నేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన వ్యక్తి మల్లేశం. చేనేత ప్రాముఖ్యతని చాటిన ఆయన జీవితం లోని మలుపులు ఆకట్టుకుంటాయి. గోరేటి వెంకన్న, చంద్రబోస్ రాసిన పాటలు, రాబీన్ స్వరాలు ప్రత్యేక ఆకర్షణ అన్నారు.













