సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చీమ-ప్రేమ మధ్యలో భామ’
అమిత్, ఇందు జంటగా నటించిన చీమ-ప్రేమ మధ్యలో భామ చిత్రం సెన్సార్ పూర్తయింది. శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ నెలాఖరులో సినిమాను విడదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ చీమ హీరో కదా అని చిన్న పిల్లలకు ఈ సినిమా ప్రత్యేకం కాదు. అంతకుమించి సృష్టిలో స్త్రీ, పురుషుల సమానం. కాకపోతే పురుషులు కొంచెం ఎక్కువ సమానం అని ఒకప్పుడు ముళ్లపూడిగారు చెప్పారు. అలాగే ఈ సినిమా అందరి కోసం.. కాకపోతే స్త్రీ కోసం కొంచెం ఎక్కువ. అవునో, కాదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు. గ్రాఫిక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని అన్నారు.













