రూమర్స్‌కు రెస్ట్ ఇన్ పీస్! క్లారిటీ ఇచ్చిన ఛార్మీ
పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ కలిసి చేసిన లైగర్ సినిమాను కరణ్ జోహార్‌తో కలిసి ఛార్మీ పూరీ జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బైకాట్ వివాదాన్ని అధిగమించి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్‌ని సొంతం చేసుకుంది.
కానీ లైగర్ అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఛార్మీ, పూరీలపై నెటిజన్లు కామెంట్ చేయడం మొదలుపెట్టడంతో కొంత కాలం సోషల్ మీడియాకు బ్రేకిస్తున్నానంటూ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి రెట్టించిన వేగంతో వస్తామని ప్రకటించింది ఛార్మీ. అయితే రీసెంట్గా లైగర్ డిజాస్టర్ కావడంతో ఆ నష్టాలని భర్తీ చేయలేక పూరీ సతమతమవుతున్నాడని, ముంబై ఆఫీస్ రెంట్ కట్టలేక ఖాళీ చేసి మకాం హైదరాబాద్‌కు మార్చాడని, పూరీ ఛార్మీల మధ్య దూరం పెరిగిందని, జనగణమన ప్రాజెక్ట్ ఆపేయడంతో పూరీ కనెక్ట్స్ నుంచి ఛార్మీ విడిపోయిందని రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛార్మీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.
‘రూమర్స్ ..రూమర్స్ రూమర్స్.. అన్ని ఫేక్!. కేవలం పూరి కనెక్ట్స్ పై దృష్టి సారిస్తున్నాను. పుకార్లకు రెస్ట్ ఇన్ పీస్!!’ అంటూ రూమర్స్ పై ఛార్మీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఛార్మీ ‘జనగణమన’ ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిందా అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.













