Parasakthi: పరాశక్తి రిలీజ్ డేట్ లో మార్పు.. ఎందుకంటే?
2026 సంక్రాంతి పోటీ రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతోంది. పండగ తేదీ దగ్గర పడుతుండటంతో మెల్లిగా ఒక్కొక్కరు తమ సినిమా డేట్స్ ను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ముందు అనుకున్న రిలీజ్ డేట్ లో ఏదైనా మార్పు ఉంటే ఆఖరిగా దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి(Parashathi) మూవీ కూడా రిలీజ్ డేట్ ను మార్చుకుంది.
ముందు చెప్పిన ప్రకారమైతే పరాశక్తి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు ఈ సినిమాను నాలుగు రోజుల ముందుగానే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు. వరల్డ్ వైడ్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకే రిలీజ్ డేట్ లో ఈ మార్పును చేసినట్టు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇప్పుడీ విషయం దళపతి విజయ్(Vijay) ఫ్యాన్స్ కు కోపాన్ని కలిగిస్తుంది.
దానిక్కారణం విజయ్ నటిస్తున్న జన నాయగన్(Jana nayagan) మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. దానికి ఒక రోజు గ్యాప్ లో పరాశక్తి రావడాన్ని విజయ్ ఫ్యాన్స్ ఏ మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే అప్పుడే సోషల్ మీడియాలో ఇరు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. సుధ కొంగర(sudha kongara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తిలో శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తుండగా రానా దగ్గుబాటి(Rana Daggubati) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.






