మరో ‘సాహసం’ చేయనున్న యేలేటి
విభిన్న కథలతో సినిమా తీయడంలో చంద్రశేఖర్ యేలేటి దిట్ట. మనుషుల జీవితాలనే కథలుగా మార్చి, వారికి ఎదురైన సంఘటనలనే తన సినిమాలలో సన్నివేశాలుగా మలచి ఎమోషన్స్ పండే విధంగా జాగ్రత్త పడతాడు. తన తాజా చిత్రం చెక్ రిలీజ్ అయిన సందర్భంగా చంద్రశేఖర్ యేలేటి ఇంటర్వూలతో బిజీ అయిపోయారు.
తన దగ్గర మరో రెండు ఆసక్తికర కథలు రెడీగా ఉన్నాయని, అందులో ఒకటి లవ్ స్టోరీ కాగా మరొకటి అడ్వెంచరస్ స్టోరీ అని చెప్పాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో లవ్ స్టోరీ ని రాసుకుంటే… అనుక్షణం ఆసక్తిని రేకెత్తించేలా అడ్వెంచర్ స్టోరీ ఉంటుందట. గతంలో తాను తెరకెక్కించిన సాహసం తరహాలో ఈ కథ నడుస్తుందని, ముందుగా ఈ కథనే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నానని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి బయట పెట్టాడు యేలేటి.













