Chandoo Mondeti: చందూ మొండేటి నెక్ట్స్ ఎవరితో సినిమా?
కార్తికేయ2(Karthikeya2) తర్వాత చందూ మొండేటి(Chandoo Mondeti) ఎవరితో సినిమా చేస్తాడా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్(Geetha Arts) లో ఓ మూవీకి సైన్ చేసిన చందూ, అందులో భాగంగానే కోలీవుడ్ హీరో సూర్య(Suriya)కు ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. చందూ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు కానీ ఎప్పుడు చేద్దామనేది మాత్రం చెప్పలేదు.
అలా సూర్య డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న చందూ దగ్గరకు తండేల్ కథ రావడం, ఆ సినిమాను పట్టాలెక్కించి, షూటింగ్ చేసేసి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కూడా అందుకోవడం చకచకా జరిగిపోయాయి. తండేల్ తర్వాత ఇప్పుడు మళ్లీ చందూ ఎవరితో సినిమా చేస్తాడనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కథతో మెప్పించిన సూర్యతో ముందుకెళ్తాడా లేదా కార్తికేయ3(karthikeya3)ను మొదలుపెడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఇప్పుడైనా చందూకు డేట్స్ ఇస్తాడా? ఒకవేళ సూర్యకు కుదరదని పక్షంలో చందూ మొండేటి నిఖిల్ తో కార్తికేయ3 కానీ, లేదంటే మరేదైనా సినిమా కానీ చేసే అవకాశముంది. ఏదేమైనా చందూ నెక్ట్స్ ఎవరితో ముందుకెళ్తాడనేది తెలియాలంటే మరో నెల రోజులాగాల్సిందే.













