NBK109లో తెలుగమ్మాయి
వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భగవంత్ కేసరి రిలీజ్ కు ముందే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను బాలయ్య ఫినిష్ చేశాడు.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎలక్షన్స్ లోపు రిలీజ్ చేయాలని బాలయ్య బాబీతో చెప్పాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. అయితే చాందినీ నటిస్తుంది హీరోయిన్ గా కాదు, ఓ కీలక పాత్రలో మాత్రమే చాందినీ నటిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన చాందినీకి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ను సంక్రాంతి సందర్భంగా అనౌన్స్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.













