ప్రభాస్ డైరెక్టర్లకు మరో ఛాలెంజ్
బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ సినిమా సినిమాకీ పెరుగుతూనే ఉంది. కల్కి సినిమా ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్లింది. కల్కి ప్రపంచ వ్యాప్తంగా 22 భాషల్లో రిలీజైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ పరంగా నాగ్ అశ్విన్ బెస్ట్ అవుట్పుట్ అందించారని, కల్కి విజువల్ స్పెక్టక్యులర్ అని అంటున్నారు.
చూస్తుంటే ప్రభాస్ కల్కితో మంచి హిట్ అందుకునేలా ఉన్నాడు. దీంతో ప్రభాస్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఈ కారణంతో ప్రభాస్ తర్వాతి సినిమాలపై నెక్ట్స్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కల్కికి ఎక్కువగా ప్రమోషన్స్ చేయకపోయినా కేవలం ట్రైలర్లతోనే ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ఈ హైప్ ప్రభాస్ తో తర్వాత సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకు ఛాలెంజ్ కాబోతుంది.
ముఖ్యంగా ప్రభాస్ తర్వాతి సినిమా డైరెక్టర్ మారుతి మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మారుతి ఇప్పటివరకు ప్రభాస్ స్థాయి హీరోతో సినిమా చేసింది లేదు. కాబట్టి ప్రభాస్ ను రాజా సాబ్ లో ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి. ఆ తర్వాత హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా మీద కూడా ఈ ప్రభావం ఉండనుంది. కానీ సందీప్ ఇప్పటికే యానిమల్ తో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. లవ్ స్టోరీల చేసే హను రాఘవపూడి, ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది.













