లక్ష్మీఎస్ ఎన్టీఆర్ విడుదల వాయిదా
ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన రెండు టీజర్లలోనూ చంద్రబాబును ద్రోహం చేశాడంటూ చూపించారు. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక ఈ చిత్రాన్ని విడుదల చేసుకోవాలని సూచించింది.













