బన్నీకి హ్యాండిచ్చిన డైరెక్టర్లు
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఎందుకొచ్చాడో ఏమో తెలీదు కానీ సడెన్ గా తమిళ డైరెక్టర్ అట్లీ, బన్నీ కాంబినేషన్ లో సినిమా అన్నారు. జవాన్ సినిమాతో ఇంప్రెస్ అయిన బన్నీ, మంచి కథ ఉంటే సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడు.
కానీ బన్నీ తో సమానంగా అట్లీ కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, కథ ఫైనల్ నెరేషన్ బన్నీకి సంతృప్తినివ్వకపోవడంతో ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప2 తర్వాత బన్నీ- త్రివిక్రమ్ కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ కూడా బన్నీతో సినిమా తీసే సిట్యుయేషన్స్ కనిపించడం లేదు.
గుంటూరు కారం సినిమాతో చాలా కామెంట్స్ తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సారి సినిమా తీస్తే పూర్తి స్థాయిలో కంబ్యాక్ ఇచ్చేలా చేయాలనుకుంటున్నాడు. దానికోసం కొంత టైమ్ అవసరమని, అందుకే మరో ఏడాది పాటూ గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ ను జాగ్రత్తగా రెడీ చేయాలని చూస్తున్నాడట. మొత్తానికి బన్నీ పుష్ప2 తర్వాత చేద్దామనుకున్న ఇద్దరు డైరెక్టర్లు తనకు హ్యాండిచ్చారు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్ట్స్ సినిమాను ఏ డైరెక్టర్ తో చేస్తాడో చూడాలి.













