బన్నీ మనసులో ఎవరున్నారు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమాను డైరెక్ట్ చేయబోయేది అట్లీనేనని, సన్ పిక్చర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుందని ఎప్పుడో నెలల కిందట వచ్చిన టాక్ మళ్లీ నాలుగైదు రోజుల నుంచి ఊపందుకుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం అట్లీ నెక్ట్స్ మూవీ బాలీవుడ్ స్టార్ తోనే అని తెలుస్తోంది. జవాన్ తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అట్లీ దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని చూస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ తో సినిమాను చేస్తున్నాడని సమాచారం. రీసెంట్ గా అట్లీ చెప్పిన ఫైనల్ వెర్షన్ సల్మాన్ కు విపరీతంగా నచ్చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఇందులో సల్మాన్ తో పాటూ కమల్ తో కూడా నటింపచేయడానికి అట్లీ ట్రై చేస్తున్నట్లు సమాచారం. అంతా సెట్ అయి సినిమా స్టార్టవాలంటే వచ్చే ఏడాది జనవరి అవొచ్చు. అంటే మరో నాలుగు నెలలుంది. మరి బన్నీ పుష్ప2 తర్వాత ఎవరితో చేస్తాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. అట్లీతో బన్నీ సినిమా ఉంటుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మొత్తానికి నిరాశే మిగిలింది. అయితే అట్లీతో సినిమా కుదరకపోయినా బన్నీతో సినిమా చేయడానికి త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఏదేమైనా ఇకమీదనైనా బన్నీ ఏడాదికి ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ అదంత ఈజీగా కుదిరేట్లు కనిపించడం లేదు.













