Peddi: పెద్ది కోసం బుచ్చిబాబు కొత్త ప్లాన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా ఉప్పెన(uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా పెద్ది(peddi). జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
పెద్ది సినిమాకు సంబంధించిన ఇప్పటికే ఓ సాంగ్ ను షూట్ చేసిన మేకర్స్, త్వరలోనే మరో సాంగ్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై త్వరలోనే మేకర్స్ ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నారట. ఈ సాంగ్ కేవలం పాటలానే కాకుండా కథను కూడా ముందుకు తీసుకెళ్లేలా సరికొత్తగా ప్లాన్ చేశాడట బుచ్చిబాబు.
సినిమాలో ఈ మాంటేజ్ సాంగ్ చాలా మెమొరబుల్ గా ఉంటుందని, ఈ సాంగ్ లో చరణ్- జాన్వీ మధ్య కెమిస్ట్రీ బాగా చూపించనున్నారని అంటున్నారు. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(sivaraj kumar) కీలక పాత్రలో నటిస్తుండగా, మార్చి 27, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) పెద్దిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.







