రామాయణం గురించి మరిచిపోవడం బెటర్
రామాయణంను మూడు భాగాలుగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ సినిమా చేస్తున్నాడని వార్త రావడంతోనే సినిమాపై బాగా హైప్ క్రియేట్ అయింది. సినిమా ఇంకా మొదలుపెట్టకుండానే మీడియాలో, ఆడియన్స్ లో ఈ రామాయణం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెల శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా లాంచ్ కానుందనే ప్రచారానికి బ్రేక్ వేయడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ అసలు ఈ ఏడాది మొదలవడం డౌటనేది లేటెస్ట్ సమాచారం.
ఇలా అనడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. అందులో మొదటిది క్యాస్టింగ్. ఈ సినిమా కోసం రాముడిగా రణ్బీర్ తప్పించి మిగిలినవన్నీ గాసిప్స్ రూపంలో వచ్చినవే. సీతగా సాయిపల్లవి ఓకే అందన్నారు కానీ ఈ విషయంపై మీడియా ముందు ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. సన్నీ డియోల్ ఓకే చెప్పాడు కానీ ఇంకా అగ్రిమెంట్ అవలేదు. రకుల్ తో ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.
మూడు భాగాలు ప్లాన్ చేసుకోవడంతో ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి దానిపై డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నాడట. ఒకవేళ వచ్చే నెల అయోధ్యలో సినిమాను ఓపెన్ చేద్దామన్నా ఎలక్షన్స్ కోడ్ నేపథ్యంలో ఏ పార్టీ నాయకులను పిలవలేరు. మోడీ సమక్షంలో ఈ కార్యక్రమం చేయాలనేది నిర్మాతల ఆలోచన. ఈ టైమ్ లో అది సాధ్యం కాదు. వీటన్నింటినీ చూస్తుంటే ఈ రామాయణంను ఆడియన్స్ కొంత టైమ్ వరకు మరిచిపోవడమే బెటర్.













