బోయపాటి దర్శకత్వంలో విజయ్?
రీసెంట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను తో ఓ సినిమాను చేయనున్నట్లు అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు కానీ సరైనోడు తర్వాత గీతా ఆర్ట్స్ కు బోయపాటి ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఆ కమిట్మెంట్ ను తీర్చుకోవాలని బోయపాటి డిసైడయ్యాడు.
అయితే ఈ సినిమా ఐకాన్ స్టార్ తో మాత్రం కాదని తేలిపోయింది. దీంతో బోయపాటి, బాలయ్య కాంబోలో ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనుందని వార్తలొచ్చాయి. కానీ 14 రీల్స్ నుంచి బాలయ్య ఓ సినిమా కోసం ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడని, ఆ సినిమా ను బోయపాటితో చేయించాలని ఒప్పిస్తున్నాడని అంటున్నారు.
ఇలాంటి టైమ్ లో సడెన్ గా విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపిస్తోంది. పరశురామ్ ను దిల్ రాజుకు లాక్ చేయించడానికి వేరే సినిమా చేస్తానని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒప్పుకున్న విజయ్, ఇప్పుడు బోయపాటి రాసుకున్న కథకు అతని ఇమేజ్ సరిపోయేలా ఉండటంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. ఇంకా హీరో ఎవరన్నది చెప్పలేదు కానీ బన్నీ అయితే కాదన్న క్లారిటీ మాత్రం వచ్చేసింది. అయితే బాలయ్య లేదంటే విజయ్ వీరిద్దరిలో ఒకరితో ఆ సినిమా ఉండే ఛాన్సుంది. ఈ విషయంలో క్లారిటీ వస్తే తప్పించి హీరో ఎవరన్నది తెలియదు.













