లాజిక్కులపై నోరు విప్పిన బోయపాటి
సినిమా అంటేనే లాజిక్స్ లేనిది. అందులోనూ బోయపాటి శ్రీను సినిమా అంటే బ్రెయిన్ ను ఆఫ్ చేసుకుని థియేటర్లకు వెళ్లాలనేది అందరూ అనే మాట. బోయపాటి సినిమాల్లో కథ దగ్గర నుంచి క్యారెక్టర్లు, సీన్స్ అన్నీ కూడా చాలా సిల్లీగా, లాజిక్ లేకుండా ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ ఉండవనేది తెలుసు కానీ మరీ ఇంత టూమచ్ గా ఉంటాయనేలా బోయపాటి సినిమాలు తీస్తున్నాడు.
రీసెంట్గా బోయపాటి నుంచి వచ్చిన స్కంద సినిమాలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. విలన్లను సీఎంగా చూపించిన బోయపాటి, హీరో వాళ్లను ఓ ఆటాడుకోవడం, వాళ్ల ఇంటికెళ్లి సెక్యూరిటీ మొత్తాన్ని నాశనం చేసి సీఎం కూతుళ్లను కిడ్నాప్ చేసి తీసుకుని రావడం చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఓ మామూలు కుర్రాడు సీఎం కూతుళ్లను ఎలా కిడ్నాప్ చేశాడనే లాజిక్ ప్రతి ఒక్కరికీ వస్తుంది.
ఈ లాజిక్స్ గురించి రీసెంట్గా బోయపాటి శ్రీను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. రియల్ లైఫ్ లో ఎవరైనా రోడ్ల మీద పాటలు పాడుకుని, డ్యాన్స్ చేస్తుంటే పిచ్చోళ్లనుకుని రాళ్లతో కొడతారు. సినిమా అంటేనే లాజిక్ లేనిది. అందుకే ఫైట్ సీన్స్ చేసేటప్పుడు హీరో ఎంతటి బలవంతుడో చూపించడానికి కాస్త ఎక్కువ ఫైట్స్ ను పెడతానని, అలా లేకపోతే ఆడియన్స్ కన్విన్స్ అవ్వలేరని కొత్త లాజిక్‌ను పట్టుకొచ్చాడు బోయపాటి.













