ఎఫ్3 కు వాళ్లిద్దరూ బోనస్..
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు దృశ్యం2 సినిమా చేస్తూనే మరో వైపు ఎఫ్3 షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. ఎఫ్3 లోని వెంకటేష్, వరుణ్ ల కాంబో లోని సీన్స్ అన్నీ దాదాపు పూర్తయ్యాయట. వీరిద్దరూ కలిసి అయిదారు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే ఎఫ్3 షూటింగ్ కంప్లీట్ అవనుందట. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అయిపోవడం వల్ల ఏ హీరోకు ఆ హీరోకు విడి విడిగా షూటింగ్ చేస్తున్నారట.
ప్రెజెంట్ వరుణ్ తో షూటింగ్ చేస్తున్న అనిల్ రావిపూడి, త్వరలోనే వెంకీతో సోలో సీన్స్ ను షూట్ చేయబోతున్నాడట. వరుణ్, మెహ్రీన్ లపై పాట కూడా షూట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దృశ్యం2 ను షూటింగ్ ముగించుకుని వచ్చాక వెంకీ, తమన్నాలపై కీలక సీన్స్ కు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎఫ్3 సినిమా అనుకున్న టైమ్ కంటే చాలా ముందే షూటింగ్ పూర్తి చేసుకునే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశేసారు.
కానీ సినిమా షూటింగ్ అయిపోవడం, ఇదంతా చూస్తుంటే మే లేదా జూన్ లోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు చిత్ర యూనిట్. ఎఫ్2 లో వెంకీ, వరుణ్ లు భార్య లతో ఇబ్బంది పడ్డ సన్నివేశాలను ఫన్నీగా చూపించగా, ఎఫ్3 లో వారిద్దరూ డబ్బు సంపాదించడం కోసం పడే కష్టాలను ఫన్నీగా చూపించనున్నాడట అనిల్ రావిపూడి. దీంతో పాటూ ఎఫ్3 లో అదనంగా వెన్నెల కిషోర్, సునీల్ లు కూడా తోడవుతున్నారు. అంటే ఎఫ్2 కు మించిన ఫన్ ఎఫ్3 లో ఉండే ఛాన్సులు చాలానే కనిపిస్తున్నాయి.













