ఉప్పెన బాలీవుడ్ రీమేక్ వర్కవుట్ అవుతుందా?
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సున్నితమైన పాయింట్ ను బుచ్చిబాబు హ్యాండిల్ చేసిన తీరు, తెలుగు ఆడియన్స్ అంత ఈజీగా అంగీకరించని హీరో ట్రీట్మెంట్ ను చూపించిన వైనం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి.
ఈ సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యారు. కానీ ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం ఇద్దరూ ఫెయిలయ్యారు. అయితే ఇంత సక్సెస్ అయిన ఉప్పెన సినిమా ఇప్పటివరకు ఏ ఇతర భాషలోనూ రీమేక్ అవలేదు. రీమేక్ రైట్స్ ఎవరూ అడగలేదా లేక మైత్రీ నిర్మాతలు ఆ రైట్స్ ను ఎవరికీ ఇవ్వలేదా అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అలాంటి ఉప్పెన సినిమా మీద బోనీ కపూర్ మనసు పడ్డాడు. తన రెండో కూతురు ఖుషి కపూర్ తో ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచన. రామ్ చరణ్16 ఓపెనింగ్ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పడంతో ఆ దిశగా అడుగులు పడొచ్చని అంతర్గత వర్గాల సమాచారం. అయితే ఉప్పెన లాంటి సినిమా బాలీవుడ్ లో అంత ఈజీగా వర్కవుట్ అవదు. మన ఆడియన్స్ కు ఉప్పెన సినిమా కనెక్ట్ అవడానికి రీజన్ నేటివిటీ. ఉప్పెన రీమేక్ ను బుచ్చిబాబు చేయలేడు కాబట్టి దాన్ని సరిగా రీమేక్ చేసే డైరెక్టర్ దొరకాలి. పైగా ఖుషి ఎంట్రీ ఇచ్చిన ఆర్చీస్ కు నెగిటివ్ మార్క్స్ బాగా పడ్డాయి. ఉప్పెన లాంటి సబ్జెక్ట్ ఖుషికి సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఏదేమైనా ఖుషిని సెట్ చేయడం బోనీ కపూర్ కు పెద్ద టాస్క్ లానే మిగిలిందిప్పుడు.













