Boney Kapoor: అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరగడంతో కొత్తగా అప్పు చేశా

సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా అనుకున్నట్టు విధంగా పూర్తవదు. ఒక్కో సినిమాకు ఒక్కో సమస్య వస్తుంటుంది. అయితే ఎక్కువగా సినిమాకు సమస్యలనేవి బడ్జెట్ విషయంలో వస్తుంటాయి. అయితే తాను తీసిన సినిమాకు ఏకంగా బడ్జెట్ రూ.90 కోట్లు పెరిగిందని, దాని వల్ల తాను అప్పు చేయాల్సి వచ్చిందని బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్(boney kapoor) తెలిపారు.
బోనీ కపూర్ ప్రొడక్షన్ లో వచ్చిన చివరి సినిమా మైదాన్(maidan). ఆ మూవీ తర్వాత ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఫుట్ బాల్ కోచ్ సయ్యర్ అబ్దుల్ రహీమ్(syed abdul raheem) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరోగా నటించగా అమిత్ శర్మ(amith Sharma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా బాక్సాఫీస్ పెద్దగా రాణించలేకపోయింది.
వాస్తవానికి మైదాన్ కు ముందు అనుకున్న బడ్జెట్ రూ.120 కోట్లేనట. కానీ కోవిడ్ వల్ల సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందని, మూవీ పూర్తి చేసే సరికి రూ.210 కోట్లు అయిందని, కోవిడ్ కు ముందే సినిమా షూటింగ్ 70% పూర్తైనా, ఫుట్ బాల్ మ్యాచ్‌ల కోసం విదేశాల నుంచి ఇంటర్నేషనల్ టీమ్స్ ను రప్పించామని, లాక్ డౌన్ వల్ల వారిని ముంబైలో హోటల్స్ లో ఉంచాల్సి వచ్చిందని, ఆ టైమ్ లో బడ్జెట్ విపరీతంగా పెరిగిందని, ఇందులో ఎవరినీ నిందించలేమని, తన సమస్యను తెలుసుకుని కొందరు తమ పారితోషికాన్ని 15% తగ్గించుకున్నారని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.