హైదరాబాద్ లో కంగనా..
బాలీవుడ్ నటి, కాంట్రావర్షియల్ క్వీన్ కంగనా రనౌత్.. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కి శుక్రవారం వచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొననున్నారని సమాచారం. కనీసం 10 రోజుల పాటు కంగన రనౌత్ షూటింగ్ షెడ్యూల్లో బిజీగా గడపనున్నారు. అయితే కంగనా రనౌత్ నగర సందర్శనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇటీవల డ్రగ్స్, సినిమా పరిశ్రమతో వరుస వివాదాలు, శివసేనతో సై అంటే సై అంటూ గొడవలు.. వగైరాల నేపధ్యంలో్ కంగనకు కేంద్రం వై కేటగిరీ భధ్రత కల్పించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ అధికారులు ఆమె రాకకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచారు. మరోవైపు హైదరాబాద్‌లో రేప్ కేసు నిందితులకు పడిన శిక్షనే ఉత్తరప్రదేశ్‌లో ని హత్రాస్‌లో కూడా అమలు చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల్లోనే కంగనా హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చారు.
హైదరాబాద్ తరహా న్యాయం అమలు చేయాలి…
బాలీవుడ్ నటి కంగన రనౌత్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశంసించారు. గతంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ (దిశ) రేప్, హత్య కేసును ఆమె గుర్తు చేస్తూ.. ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తిగా సమర్ధించారు. ఆ సమయంలో నిందితుల ఎన్కౌంటర్ చేయడం ద్వారా బాధితులకు వేగవంతమైన న్యాయం లభించిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ లో జరిగిన రేప్ కేసు నిందితులపై కూడా అదే తరహా చర్యలు చేపట్టాఅని ఆమె ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి సరైన విధంగా న్యాయం చేస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.













