మెగాస్టార్ తో హ్యుమా ఖురేషి?
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా వున్నాడు. కథపై కసరత్తు చేసిన ఆయన దానిని ఒక కొలిక్కి తీసుకొచ్చే పనిలో వున్నాడట. సంక్రాంతి తరువాత ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమలో చిరంజీవి సరసన కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యుమా ఖురేషి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రజనీ సరసన కలా సినిమాలో చేసిన కారణంగా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిరూ మూవీ కోసం ఆమెను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే, ఆమెనే ప్రధాన కథానాయికగా? లేదంటే మరో హీరోయిన్ వుండనుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.













