Yellamma: ఎల్లమ్మ కోసం బాలీవుడ్ కంపోజర్లు?
అప్పటివరకు టాలీవుడ్ లో కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి(Venu Yeldandi) బలగం(Balagam) సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో వేణు వరుసపెట్టి సినిమాలు చేస్తాడనుకుంటే తాను మాత్రం రెండో సినిమాను చాలా ఆలస్యం చేశాడు. ఎల్లమ్మ(Yellamma) అనే కథను రాసుకుని ఆ కథ కోసం హీరోలను వెతికే పనిలో భాగంగాఎంతో టైమ్ ను వేస్ట్ చేసుకున్నాడు.
ఎల్లమ్మ కథను ముందు వేణు నాని(Nani)కి చెప్పాడు. నానికి స్టోరీ లైన్ నచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేయమనడంతో వేణు కాస్త టైమ్ తీసుకుని నానికి ఫైనల్ వెర్షన్ చెప్పాడు. దానికి కూడా నాని సంతృప్తి చెందకపోవడంతో ఎల్లమ్మ కథ ను రిజెక్ట్ చేశాడు నాని. ఆ తర్వాత అదే కథ శర్వానంద్(Sharwanand) దగ్గరకు కూడా వెళ్లింది కానీ సెట్ అవలేదు.
ఆఖరికి నితిన్(Nithin) కు చెప్పి సినిమాను ఓకే చేయించుకున్న వేణు ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ వేణు ప్రస్తుతం ముంబైలోని బాలీవుడ్ కంపోజర్లైన అజయ్(Ajay)- అతుల్ (Atul)తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడని సమాచారం. ఇదే నిజమైతే మే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఎల్లమ్మకు వేణు బాలీవుడ్ టచ్ ఇవ్వడం ఖాయమైనట్టే. ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మించనున్న విషయం తెలిసిందే.













