Chiranjeevi: బాబీతో చిరూ మరో సినిమా?
ప్రస్తుతం బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vasishta)తో విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. విశ్వంభర తర్వాత ఆల్రెడీ మెగాస్టార్ రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒకటి అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో కాగా మరొకటి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో.
ఈ రెండింటిలో మెగాస్టార్ మొదటిగా అనిల్ రావిపూడితో సినిమాను చేయనున్నాడు. ఆల్రెడీ అనిల్ దానికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేయగా, ఈ ఉగాది రోజున సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
అతను మరెవరో కాదు, టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli). బాబీ, చిరంజీవితో కలిసి గతంలో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా చేశారు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కలయికలో ఇప్పుడు మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బాబీ, చిరూ కోసం ఓ మంచి కథను రెడీ చేస్తున్నాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాదికి ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ బలంగా వినిపిస్తోంది.













