బాబీకి మరో బంపరాఫర్
యానిమల్ సినిమాలో అబ్రార్ గా అందర్నీ తన నటనతో మెప్పించిన బాబీ డియోల్ ఆ సినిమా తర్వాత చాలా బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, బాలకృష్ణ- బాబీ సినిమాలో, సూర్య కంగువ సినిమాలో విలన్ గా అవకాశాలందుకుని కెరీర్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు బాబీ డియోల్‌కు మరో బంపరాఫర్ వచ్చింది.
కోలీవుడ్ ను ఏలుతున్న విజయ్ సినిమాలో బాబీ డియోల్ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కంగువ సినిమాతో తమిళ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న బాబీ డియోల్ కు ఇది మామూలు అవకాశం కాదు. హెచ్. వినోత్ దర్శకత్వంలో విజయ్ 69గా రానున్న సినిమాలో బాబీ ఎంపికైనట్లు తెలుస్తోంది.
విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్తూ సినిమాలకు స్వస్తి చెప్పే క్రమంలో చేస్తున్న ఆఖరి సినిమా ఇదేనని ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి క్రేజీ సినిమాలో బాబీ డియోల్ అవకాశం అందుకున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













