సంజయ్ ను బీట్ చేసిన బాబీ
ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వారు ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు తమను తాము మార్చుకుని విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. సౌత్ లో ఈ మధ్య నార్త్ యాక్టర్ హడావిడి ఎక్కువైపోయింది. మీడియం, భారీ బడ్జెట్ అని తేడా లేకుండా తమకు నచ్చిన ప్రాజెక్టులను చేసుకుంటూ బిజీగా మారారు బాలీవుడ్ సీనియర్ యాక్టర్లు.
ఈ విధంగానే సంజయ్ దత్(Sanjay Dutt) సౌత్ లో బాగా ట్రెండ్ అయ్యాడు. కెజిఎఫ్(KGF) తో విలన్ గా క్రేజ్ అందుకున్న సంజూ ఆ తర్వాత లియో(Leo), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాల్లో చేశాడు. ప్రస్తుతం రాజా సాబ్(Raja Saab) లో కూడా సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు పోటీగా యానిమల్(Animal) విలన్ బాబీ డియోల్(Bobby Deol) వచ్చాడు.
బాబీ డియోల్ ఇప్పటికే సౌత్ లో మంచి లైనప్ ను సెట్ చేసుకున్నాడు. తమిళంలో అతను నటించిన కంగువ(Kanguva) రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా విజయ్ 69(Vijay69)లో ఆఫర్ కొట్టేశాడు. హరిహర వీరమల్లు(HariHara Veera Mallu) షూటింగ్ దశలో ఉంది. బాబీ(Bobby)- బాలకృష్ణ(Balakrishna) సినిమాలో కూడా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే విలన్ కేటగిరీలో సంజయ్ దత్ ను బాబీ డియోల్ డామినేట్ చేస్తున్నాడనే చెప్పాలి. అంతేకాదు ప్రాజెక్టుకు తగ్గట్టు తన పారితోషికాన్ని తగ్గిస్తూ పెంచుతూ ఉన్నాడట బాబీ డియోల్. తన పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గినా కూడా ఆ సినిమా చేయడానికి రెడీ అవడంతో దర్శకనిర్మాతల ఫోకస్ ఎక్కువగా బాబీ డియోల్ పై పడుతుంది.













