“తాగిన మత్తులో ఉన్న రాత్రులు.. మంచి జ్ఞాపకాలు” వైరల్ అవుతున్న శ్రీయ ఫోటో!
కొంతమంది సినిమా సెలబ్రిటీస్‌కి ఎఫైర్లు సర్వసాధారణమే. ఇండస్ట్రీకి రాకముందో, వచ్చిన తర్వాతో కొంతమంది హీరోలు, హీరోయిన్లు తమకు నచ్చిన వారితో ప్రేమాయణం నడిపిస్తుంటారు. కానీ, ఒక హీరోయిన్‌కి పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ నిర్మాత ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైతే.. అప్పుడు ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడీ అనుభవం టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రీయాశరణ్ విషయంలో జరిగింది. తెలుగులో అందరు టాప్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన శ్రీయ కొత్త హీరోయిన్లు రావడంతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో 2018లో టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయింది. ఏదైనా సినిమా షూటింగ్ ఉంటే తప్ప ఇండియా రావడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ బాలీవుడ్ నిర్మాత తనూజ్గార్గ్ తను శ్రీయతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతే కాదు `అప్పట్లో తాగిన మత్తులో ఉన్న రాత్రులు.. మంచి జ్ఞాపకాలు` అంటూ కామెంట్ కూడా చేశాడు.
ఇప్పుడు ఈ ఫోటో ప్లస్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీయపై రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. తనూజ్‌తో ఎంతో క్లోజ్‌గా ఉన్న ఈ ఫోటోను శ్రీయ భర్త చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీయ ఎలాంటి కామెంట్ చేయడం లేదు. ఇక శ్రీయ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన ఒక హిందీ సినిమా, ఒక తమిళ్ సినిమా విడుదల కావాల్సి ఉండగా. ఒక తెలుగు సినిమా, ఒక తమిళ్ సినిమా నిర్మాణంలో ఉన్నాయి.













