బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పాటల్ని విడుదల చేసిన డీకే అరుణ
మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్పూర్ పోలీస్ స్టేషన్. గోరేటి వెంకన్న కీలకపాత్రధారి. నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. మహంకాళి శ్రీనివాస్ నిర్మాత. హైదరాబాద్లో పాటల్ని డీకే అరుణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా పాలమూరు జిల్లాకు చెందిన నటీనటులు ఈ సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు. పాటలతో హుషారెక్కించే గోరేటి వెంకన్న ఓ మంచి పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. చదువుకుంటున్న రోజుల్లో దర్శకుణ్ని కావాలనుకుని ఇక్కడ అడుగుపెట్టా. కొంతకాలం ప్రయత్నించాను. కానీ ఈ రంగం మనకు సరిపడదని భావించి వెనక్కి వెళ్లి పోయా. ఇప్పుడు నిర్మాతగా ఓ మంచి చిత్రం తీసినందుకు ఆనందంగా ఉందన్నారు మహంకాళి శ్రీనివాస్. అత్యంత సహజమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. ఈ నెల 15న విడుదల చేస్తున్నామన్నారు దర్శకుడు.













