భారతీయుడు3లో భారీ ట్విస్ట్.. రివీల్ చేసిన కమల్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్2 సినిమా వచ్చే జులై 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో టీమ్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసింది. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశీ పర్యటనలు చేసి కూడా ఇండియన్2 ను ప్రమోట్ చేస్తున్నారు కమల్, సిద్దార్థ్, శంకర్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఇండియన్3 కి సంబంధించిన ఓ ట్విస్ట్ ను రివీల్ చేసేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇండియన్3లో సేనాపతి తండ్రి వస్తాడు. అంటే ఫస్ట్ పార్ట్ చనిపోయిన చందూ తాతయ్య అన్నమాట. స్వాతంత్య్రం కోసం చేసిన యుద్ధంలో సేనాపతి పాల్గొనే టైమ్ కు వయసు మళ్లిన ఓ పోరాట యోధుడు ఆయన తండ్రిగా మరోవైపు బ్రిటీషర్లతో తిరుగుబాటు చేస్తాడన్నమాట.
ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్. అసలు ఇప్పటికే భారతీయుడు వయసు 100 ఏళ్లు దాటిపోతే ఫైట్స్ ఎలా చేస్తాడని కొందరు అంటుంటే, ఇప్పుడు కొత్తగా ఇండియన్3లో మరో కమల్ హాసన్ ఉంటాడని చెప్పడం అందరికీ షాకింగ్ న్యూస్. ఈ లెక్కన కాజల్ జోడీగా కనిపించేది సేనాపతి తండ్రితోనే. ఈ ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకం కానుంది.













