SSMB29: మహేష్ మూవీ కోసం ఇండియాలోనే భారీ సెట్

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది లేదు. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మామూలుగానే రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. భారీ బడ్జెట్ తో పాటూ ఆయన తన సినిమాల కోసం భారీ సెట్స్ ను కూడా వేయిస్తూ ఉంటాడనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 కోసం జక్కన్న ఓ భారీ సెట్ ను వేయిస్తున్నాడట.
అయితే ఈ సెట్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన సెట్టింగ్ గా తెలుస్తోంది. ఏకంగా రూ.50 కోట్లతో రాజమౌళి వారణాసి సెట్ ను వేయిస్తున్నాడని, సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరగనుండగా మేకర్స్ ఆ సెట్ ను ఎంతో జాగ్రత్తగా ప్రతీ అంశాన్నీ పరిశీలించి మరీ వేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.