‘భరత్ అనే నేను’ సెకండ్ సాంగ్ విడుదల
మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు. తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. ఐ డోంట్ నో అంటూ సాగే ఈ పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండో సాంగ్‌గా విడుదలైన ఈ పాట కూడా సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. ఈ పాట పాడినందుకు ఫర్హాన్‌కి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భరత్ అనే నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందగా, ఇందులో మహేష్, కైరా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు.













