బ్యూటీపుల్ సెన్సార్ పూర్తి
నైనా, సూరి జంటగా నటించి చిత్రం బ్యూటీపుల్. ట్రిబ్యూట్ టూ రంగీలా అనేది చిత్రానికి ఉపశీర్షిక. అగస్త్య మంజు ఈ చిత్రానికి రచన, ఫొటోగ్రఫీతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ రూపొందించగా టి.అంజయ్య సమర్పించారు. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. వైవిద్యమైన ప్రేమకథా చిత్రమిది. హీరో హీరోయిన్లు బాగా నటించారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి పాటు: సిరాశ్రీ.













